News April 8, 2025
సన్న బియ్యం పంపిణీ చేసిన ఆసిఫాబాద్ కలెక్టర్

ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యంను ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ అన్నారు. మంగళవారం వాంకిడి డీఆర్డీపోలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ RDO లోకేశ్వర్ రావుతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడు సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News April 17, 2025
KNR బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

KNR బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్, జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఎన్నికల వివరాలను తెలుసుకుని అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజును మంత్రి పొన్నం ప్రత్యేకంగా అభినందించారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.
News April 17, 2025
కరీంనగర్: నేటి నుంచి అవగాహన సదస్సులు

భూభారతి నూతన రెవేన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో నిర్వహించే సదస్సులకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసింది.
News April 17, 2025
ప్రపంచంలో మొట్టమొదటి స్పెర్మ్ రేస్.. ఎక్కడంటే?

లాస్ ఏంజెలిస్‌లో ప్రపంచంలోనే తొలిసారిగా స్పెర్మ్ రేస్ ఈ నెల 25న జరగబోతోంది. తగ్గుతున్న పురుషుల సంతానోత్పత్తి రేటుపై అవగాహన కల్పించేందుకు స్పెర్మ్ రేస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న కార్యక్రమం చేపడుతోంది. ఈ రేస్‌లో 1,000 మంది పాల్గొంటారు. వీర్యం నమూనాలను 20 సెం.మీ పొడవైన మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్‌పై ఉంచుతారు. ఏ నమూనా స్పెర్మ్ ముందుగా ఫినిష్ లైన్ చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తారు.