News April 4, 2025
సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: NRPT కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం నర్వ మండల కేంద్రంలోని చౌకధర దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.
Similar News
News September 17, 2025
విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్-2025

నవంబర్ 14,15తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్షిప్ సమ్మిట్-2025 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని నారా లోకేశ్ గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దూసుకెళ్తున్నామని చెప్పారు. పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు.
News September 17, 2025
మంచిర్యాల: అంతా స్వాతంత్ర్య సంబరాల్లో.. ఆయన మాత్రం జైలులో..!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో లక్షెట్టిపేటకు చెందిన సంపత్ లాల్ సిసోడియా కీలక పాత్ర పోషించారు. అజ్ఞాతంలో ఉంటూ కుటుంబాన్ని నిజాం రజాకారులు ఎన్ని బాధలు పెట్టినా తెలంగాణ విముక్తి కోసం పోరాడారు. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య సంబరాల్లో ఉంటే సంపత్ లాల్ మాత్రం జైలులో ఉన్నారు. వల్లభభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాం తెలంగాణను భారత ప్రభుత్వానికి అప్పగించాక జైలు నుంచి విడుదల చేశారు.
News September 17, 2025
OG టికెట్ ధరలు భారీగా పెంపు

పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.1000గా పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్ఠంగా రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.