News March 31, 2025
సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులోని రేషన్ షాపులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆర్డీవో రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
Similar News
News November 7, 2025
HYD మెట్రో ఛార్జీల పెంపు.. అదంతా FAKE

HYD మెట్రో రైలు ఛార్జీల పెంపుపై వస్తున్న వార్తలపై IPR అసిస్టెంట్ డైరెక్టర్ జాకబ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి ఛార్జీల సవరణ లేదని తెలిపారు. మెట్రో రైల్వేస్ (O&M) చట్టం- 2002 ప్రకారం, ఛార్జీలు నిర్ణయించే బాధ్యత మెట్రో రైల్వే అడ్మినిస్ట్రేషన్ (MRA)కి ఉంటుంది. ఈ నిర్ణయం FFC సిఫార్సుల ఆధారంగా మాత్రమే తీసుకుంటారని పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న ఛార్జీల పెంపు వార్తలు నిరాధారమన్నారు.
News November 7, 2025
అది పాకిస్థాన్ చరిత్రలోనే ఉంది: భారత్

అణ్వాయుధాలను <<18185605>>పరీక్షిస్తున్న<<>>దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. రహస్య, చట్ట విరుద్ధ అణు కార్యక్రమాలు నిర్వహించడం పాక్ చరిత్రలోనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విమర్శించారు. దశాబ్దాలపాటు స్మగ్లింగ్, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు నిర్వహించిందని అన్నారు. ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నామన్నారు.
News November 7, 2025
HYD: ఎమ్మెల్సీ ఫోన్ హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు

MLC శంభీపూర్ రాజు ఫోన్‌ను దుండగులు హ్యాక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. వ్యక్తిగత, అధికారిక సమాచారం భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, దుండిగల్ పోలీస్ స్టేషన్‌తో పాటు గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. హ్యాకింగ్‌పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.


