News October 22, 2025
సన్న రకానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్: అది శ్రీనివాస్

ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రకటించారు. బుధవారం చందుర్తి మండలం, సనుగుల గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆయన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News October 23, 2025
JGTL: ‘విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి’

విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈఓ రాము అన్నారు. సమగ్ర శిక్ష పాపులేషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు టీచర్స్ భవన్ లో బుధవారం నిర్వహించినారు. ఇందులో మొదటి స్థానంలో జఫ్స్ గుట్రాజ్ పల్లి, 2వ స్థానంలో TGMS గొల్లపల్లి, 3వ స్థానంలో ZPHS సుద్దపల్లి పాఠశాలలు నిలిచాయి. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను డీఈఓ ప్రత్యేకంగా అభినందించారు.
News October 23, 2025
ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించడానికి జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగిందని, అవి 24×7 అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద పికెట్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.
News October 23, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

➾SKLM: జలజీవన్ మిషన్‌పై సమీక్ష
➾రావివలస ఎండల మల్లన్న దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తా: అచ్చెన్న
➾శ్రీకాకుళంలో వైసీపీ రచ్చబండ
➾ప్రజా సమస్యలను పరిష్కరించాలి:ఎమ్మెల్యే శిరీష
➾జలమూరు: ప్రధాన రహదారిపై నిలిచిన నీరు
➾బూర్జ: లక్కుపురంలో కుళాయిలు నుంచి బురద నీరు
➾SKLM: విద్యార్థులకు అసెంబ్లీలో పాల్గొన్న అవకాశం
➾ఆముదాలవలసలో కుక్కలు స్వైరవిహారం