News January 15, 2026
సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూస్తున్నారా?

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడే సన్‌స్క్రీన్‌లో కొన్ని పదార్థాలు కలిస్తే హానికరంగా మారతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ హార్మోన్లపై ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. అందుకే సన్‌స్క్రీన్ కొనేటప్పుడు లేబుల్ కచ్చితంగా చెక్ చేయాలని సూచిస్తున్నారు. ✍️సన్‌స్క్రీన్ వల్ల వచ్చే లాభనష్టాల గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధకేటగిరీ<<>>కి వెళ్లండి.
Similar News
News February 15, 2026
ఖమ్మం: ప్రత్యేకం.. విగ్రహ రూపంలో శివపార్వతులు

కల్లూరు మండలంలోని చెన్నూరు పరిధి రావికంపాడులో మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇక్కడి ఆలయంలో లింగాకారంలో కాకుండా, శివపార్వతులు విగ్రహ రూపంలో స్వయంభువులుగా దర్శనమివ్వడం ప్రత్యేకతని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తిరునాళ్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆదివారం జరగనున్న వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
News February 15, 2026
యాప్‌తో అసలైన రైతులకే యూరియా: వ్యవసాయశాఖ

TG: ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్ రైతులకు ఉపయోగకరంగా మారిందని వ్యవసాయ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 14 నాటికి 12.73 లక్షల మంది రైతులు 50.48 లక్షల యూరియా సంచులను బుక్ చేసుకున్నారని పేర్కొంది. పట్టాదార్ పాస్ బుక్, RoFR లబ్ధిదారులు, కౌలు రైతులు మాత్రమే ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని, దీని ద్వారా అసలైన రైతులకే యూరియా అందుతుందని తెలిపింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఈ యాప్ పని చేస్తోందని వివరించింది.
News February 15, 2026
‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి.. అనుమానాలు?

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న అతడు ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు మత్స్యకారులు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గతంలో ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారారు.


