News January 28, 2025

సబ్బవరం: బాలిక కిడ్నాప్ కేసులో మరొకరు అరెస్ట్

image

సబ్బవరం మండలంలోని ఓ గ్రామంలో బాలికను కిడ్నాప్ చేసిన కేసులో మరో నిందితుడు ఎం.సాయి కుమార్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ తెలిపారు. గతేడాది అక్టోబర్ 19న విజయనగరం జిల్లాకు చెందిన పి.మహేశ్ బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈనెల 10న మహేశ్‌ను అరెస్టు చేయగా అతనికి సహకరించిన సాయికుమార్‌ను అరెస్టు చేసి 23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News September 19, 2025

NLG: వ్యవసాయాధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

నిడమనూరు మండల వ్యవసాయ అధికారి ముని కృష్ణయ్యను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. యూరియా కోసం రైతులు గురువారం నిడమనూరులో 2 గంటలకు పైగా కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో సమయంలో వ్యవసాయాధికారి స్థానికంగా అందుబాటులో లేడన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 19, 2025

నెల్లూరు: రూ.15వేల సాయం.. నేడే లాస్ట్ ఛాన్స్

image

నెల్లూరు జిల్లాలోని ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం వాహనమిత్ర కింద రూ.15వేలు సాయం చేయనుంది. ఈనెల 17వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2023 వరకు ఈ పథకం కింద సాయం పొందిన వాళ్లు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్లు ఎవరైనా ఉంటే ఇవాళ సాయంత్రంలోపే దరఖాస్తు చేసుకోవాలి. 2023 వరకు సాయం పొందిన వాళ్లు సైతం సచివాలయంలో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం మంచిది.

News September 19, 2025

పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

image

TG: పార్టీ ఫిరాయింపులపై ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా, దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. సంజయ్, పోచారం, యాదయ్య, వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు ఈ నోటీసులు ఇచ్చారు.