News September 18, 2025
సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, నీటి ప్రాజెక్టుల వంటి అంశాలపై గళమెత్తేందుకు సిద్ధమయ్యారు. ఓర్వకల్లు పారిశ్రామిక పార్క్‌కు భారీ పరిశ్రమలు వస్తుండటంతో పెట్టబడుల వివరాలను మంత్రి భరత్ వివరించే అవకాశముంది. ఇక తమ గోడు అసెంబ్లీలో వినిపించాలని ఉల్లి, టమాటా రైతులు కోరుతున్నారు.
Similar News
News September 18, 2025
KNR: చేతిరాత చాలా ముఖ్యమైంది: కలెక్టర్

కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం రాత్రి జిల్లా స్థాయి చేతిరాత విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి హాజరై మాట్లాడారు. హ్యాండ్ రైటింగ్ జీవితంలో చాలా ముఖ్యమైందని, దీనిని ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు. చేతిరాత అంటే మైండ్ రైటింగ్ అని, మేధస్సుకు పదును పెట్టి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
News September 18, 2025
జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ నాయకురాలు?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల్లో తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కొత్త పేరు బయటకు వచ్చింది. ఆ పార్టీ HYD నేత మాధవీలత పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారని సమాచారం. తాను పోటీచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఆ అదృష్టం దక్కాలని కోరుకుంటున్నానని బోరబండలో పేర్కొన్నారు. మాధవీలత గతంలో HYD ఎంపీ స్థానానికి పోటీచేసి పరాజయం పాలయ్యారు.
News September 18, 2025
జూబ్లీహిల్స్‌లో ‘కలర్ ఫొటో’కు అవకాశం?

త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఈవీఎంలలో ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అమలు చేస్తారో? లేదో? కమిషన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే కలర్ ఫొటో గురించి ఇప్పటికే అన్ని రాష్ర్టాలకూ ఈసీ లేఖలూ రాసింది. ఇదే జరిగితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాడే EVMలలో అభ్యర్థుల కలర్ ఫొటో చూసి ఓటేయవచ్చన్న మాట.