News December 28, 2025
సభా సమయం.. వేడెక్కిన రాజకీయం!

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేతల కామెంట్లతో రాజకీయం వేడెక్కింది. సభలో ప్రభుత్వం హుందాగా ప్రవర్తిస్తుందని, ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అటు ఎన్నిరోజులైనా సభను నడుపుతామని చెప్పే ప్రభుత్వం ఒక్కరోజుతో సమావేశాలు ముగించేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కనీసం 15రోజులైనా సభను నడపాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News January 5, 2026
ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. హరీశ్‌కు ఊరట

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మాజీ DCP రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతివ్వాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. గతంలో హరీశ్, రాధాకిషన్‌పై FIR నమోదు కాగా హైకోర్టు దాన్ని క్వాష్ చేసింది. దీంతో ప్రభుత్వం SCని ఆశ్రయించింది. అయితే HC ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని SC తాజాగా స్పష్టం చేసింది.
News January 5, 2026
ఢిల్లీ అల్లర్ల కేసు.. ప్రధాన నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత!

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు SCలో చుక్కెదురైంది. నిందితులపై ఉన్న ఆరోపణలు నిజమని నమ్మడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. UAPA కింద రూల్స్ కఠినంగా ఉంటాయని, కేవలం ట్రయల్ లేట్ అవుతోందన్న కారణంతో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. మరో ఐదుగురిపై ఉన్న ఆరోపణల తీవ్రత తక్కువ ఉన్న దృష్ట్యా వారికి మాత్రం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
News January 5, 2026
IT షేర్ల పతనం.. కారణమిదే!

IT కంపెనీల ఫలితాల సీజన్ మొదలవనున్న తరుణంలో ఆ రంగంలోని సంస్థల షేర్లు కుప్పకూలాయి. నేడు Nifty IT ఇండెక్స్ ఏకంగా 2.5% పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం థర్డ్ క్వార్టర్‌లో IT కంపెనీల గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందన్న అంచనాలే దీనికి కారణం. అమెరికా, యూరప్ దేశాల్లో సెలవుల వల్ల బిజినెస్ తగ్గడం, కొత్త డీల్స్ రాకపోవడం IT సెక్టార్‌పై ఒత్తిడి పెంచుతోంది.


