News February 1, 2025
సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలి: బాపట్ల జేసీ
బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ సభ్యత్వ నమోదు గురించి జిల్లా స్థాయి కమిటీ మీటింగ్ శనివారం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈ శ్రమ్ పోర్టల్‌లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News February 1, 2025
గొల్లపల్లి: రోడ్డు ప్రమాదం.. ఏడేళ్ల చిన్నారి దుర్మరణం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం స్పందన (7) అనే చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. స్పందన మండలంలోని చిల్వకోడూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. ప్యాసింజర్ ఆటో డోర్‌పై కూర్చొని ఇంటికి వస్తుండగా ఆటో ఎత్తేయడంతో పాప కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గొల్లపల్లి ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 1, 2025
బడ్జెట్లో ఖమ్మంకు తీవ్ర అన్యాయం: సీపీఎం
ఖమ్మం: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, బిహార్ ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని ఆరోపించారు. జిల్లాకు నిధుల కేటాయింపుపై అన్యాయం చేశారని, దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
News February 1, 2025
సంతనూతలపాడు: మహిళలకు ఉచిత కంప్యూటర్ కోర్స్
సంతనూతలపాడు మండలం ఏండ్లూర్ వద్ద మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ కోర్స్ శిక్షణ తరగతులు ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జే.రవితేజ యాదవ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15 నుంచి 45 సంవత్సరాలు లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.