News December 2, 2025

సమంత పెళ్లి పోస్టు.. 16 గంటల్లో 79.5 లక్షల లైక్స్

image

దర్శకుడు రాజ్ నిడిమోరును హీరోయిన్ సమంత రెండో <<18438537>>వివాహం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌కు 16 గంటల వ్యవధిలోనే దాదాపు 79.5 లక్షల లైక్స్ రావడం గమనార్హం. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఈ జోడీకి విషెస్ చెబుతున్నారు. రాజ్ రూపొందించిన ఫ్యామిలీమ్యాన్-2 సమయంలో సమంతతో ప్రేమ మొదలైనట్లు సినీ వర్గాలు తెలిపాయి.

Similar News

News December 3, 2025

APPLY NOW: IIIT వడోదరలో ఉద్యోగాలు

image

IIIT వడోదర 7 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ట్రైనింగ్& ప్లేస్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(మేనేజ్‌మెంట్/ ఇంజినీరింగ్/LAW), CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.56,100- రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: iiitvadodara.ac.in

News December 3, 2025

ఈ నెల 6 నుంచి లోకేశ్ విదేశీ పర్యటన

image

AP: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు అమెరికాలో, 11-12 తేదీల్లో కెనడాలో పర్యటిస్తారు. తొలి రోజు డల్లాస్‌లో ప్రవాసులతో భేటీ అవుతారు. ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లో ప్రముఖ సంస్థల CEOలతో ‘బిజినెస్ టు బిజినెస్’ సమావేశాలు నిర్వహిస్తారు. కెనడాలో మాన్యుఫాక్చరింగ్ సంస్థలతో చర్చలు జరపనున్నారు.

News December 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 85

image

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>