News November 18, 2025

స‌మ‌గ్ర శిక్ష ఆధ్వ‌ర్యంలో ఉచిత ఉప‌క‌ర‌ణాలు: స‌మ‌గ్ర శిక్ష ఏపీసీ

image

ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న విద్యార్థుల‌కు (CWSN) ఐదు ప్రాంతాల్లో ఉచిత ఉప‌క‌ర‌ణాల నిర్ధార‌ణ శిబిరాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు సమ‌గ్ర శిక్ష ఏపీసీ ఎం.ర‌జ‌నీకుమారి తెలిపారు. ఈ నెల 18న ఎంకే బేగ్ హైస్కూల్(విజ‌య‌వాడ), 19న మైల‌వ‌రం, 20న తిరువూరులోని కంభంపాడు, 21న నందిగామ, 22న జ‌గ్గ‌య్య‌పేటలోని చిల్ల‌క‌ల్లు జడ్పీహెచ్ఎస్‌లో నిర్వహిస్తామన్నారు.

Similar News

News November 18, 2025

నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

image

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.

పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

image

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్‌ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్‌ కాంబినేషన్‌లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.