News August 5, 2025
సమన్వయంతో ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం అన్నీ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. ఎస్పీ సతీశ్ కుమార్‌తో కలిసి సోమవారం డీఆర్సీ మీటింగ్ హాల్లో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి లోకేశ్ అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 9, 2025
అమరావతికి మరో ప్రముఖ సంస్థ

అమరావతికి మరో ప్రముఖ సంస్థ వస్తుంది. రూ.200 కోట్లతో అమరావతిలో 4 ఎకరాల్లో వివాంత (తాజ్ గ్రూప్) 5-స్టార్ హోటల్ నిర్మాణం కానుంది. మందడం సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన CRDA స్థలం కేటాయించగా ప్రస్తుతం చదును చేస్తున్నారు. 2028 నాటికి ఈ 5-స్టార్ హోటల్ ప్రారంభం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఆతిథ్యం, పెట్టుబడి రంగానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అని పలువురు అంటున్నారు
News September 9, 2025
GNT: అమ్మకు కష్టం వస్తే.. ఆశ్రయం కల్పించారు

తక్కెళ్లపాడు రోడ్డులో సోమవారం ఓ వృద్దురాలు దీనస్థితిలో పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్దురాలిని వదిలి పెట్టి వెళ్లడంతో స్థానికులు పాతగుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ టీమ్ ఆ వృద్దురాలికి సపర్యలు చేసి పొన్నూరు గోతాలస్వామి ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.
News September 8, 2025
Way2News ఎఫెక్ట్.. దుర్గగుడికి వైద్యుల కేటాయింపు

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైద్యులు లేకపోవడంపై Way2Newsలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై DMHO సుహాసిని స్పందించారు. సోమవారం ఇద్దరు వైద్యులను దుర్గగుడికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట ఏరియాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేశ్ బాబు, కృష్ణలంకలో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ కృష్ణలను డిప్యూటేషన్‌పై దుర్గగుడిలో పనిచేయాలని ఆదేశాలు అందాయి. దీంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.