News February 24, 2026

సమన్వయంతో బోర్డు పరీక్షలు నిర్వహించండి: సీఎస్

image

పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. జిల్లాలో 13,125 మంది ఇంటర్‌, 9,758 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.

Similar News

News February 26, 2026

యాదాద్రి: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

News February 26, 2026

SVU: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండో, మూడో సంవత్సర ఇయర్ ప్యాటర్న్ (వార్షిక విధానం) పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు హాల్ టికెట్లను పొందని వారు పరీక్ష సమయానికి ముందుగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద పొందవచ్చని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

News February 26, 2026

TTD: 193 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

image

శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో నిర్వహించిన కమిటీ సమావేశంలో TTD ప్రాణదాన పథకం కింద 193 మంది పేద రోగులను ఉచిత శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వివిధ వైద్య విభాగాల్లో అర్హులైన నిరుపేదలకు పూర్తిగా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బియ్యం కార్డు కలిగిన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డా ఆర్.వి.కుమార్ తెలిపారు