News January 29, 2025
సమన్వయంతో విధులు నిర్వహించాలి: సీపీ అనురాధ

పోలీస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సిద్దిపేట వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ కార్యాలయాలను సీపీ సందర్శించారు. స్టేషన్ పరిసర ప్రాంతాలు, సీజ్ చేసిన వాహనాలు పరిశీలించారు. మొక్కలు నాటారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News February 18, 2026
అల్లూరి: A2గా MLC అనంత బాబు భార్య.. కోర్టులో ఛార్జ్‌షీట్!

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను రెండో నిందితురాలిగా (A2) పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య ఘటన గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా ఆ ఛార్జ్ షీట్‌తో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
News February 18, 2026
పైజామా లాగడమూ అత్యాచారయత్నమే: సుప్రీంకోర్టు

మహిళల పైజామా లాగడం, వక్షోజాలను తాకడం కూడా అత్యాచారయత్నమే అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2025లో ఓ 11ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. సెక్షన్ 376, సెక్షన్ 18 కింద అంతకుముందు స్పెషల్ జడ్జి ఇచ్చిన సమన్లను పునరుద్ధరించింది. కాగా స్పెషల్ జడ్జి సమన్లను, అత్యాచారయత్న ఆరోపణలు కొట్టివేసి సెక్షన్లను మార్చి గతఏడాది అలహాబాద్ HC తీర్పునిచ్చింది.
News February 18, 2026
విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని, 71 యుద్ధ నౌకల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది.


