News January 8, 2026

‘సమవర్తి’ చిత్రంలో బండి ఆత్మకూరు వాసి

image

పంచభూత ప్రొడక్షన్ నిర్మిస్తున్న ‘సమవర్తి’ చిత్రంలో కథానాయకుడిగా సత్యదేవ నటిస్తున్నారు. ఈ చిత్ర బృందం గత నెలలో బేతంచెర్ల మండలం బిల్వస్వర్గం గుహలలో కొన్ని సన్నివేశాలను రూపొందించింది. గిరిజన వేషధారణలో నటించినట్లు బండి ఆత్మకూరు(M) పెద్దదేవలాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర నాయక్ తెలిపారు. గతంలో భారతీయుడు-2, రంగస్వామి, సిద్ధన గట్టు.. పలు చిత్రాలలో నటించినట్లు వెల్లడించారు.

Similar News

News January 31, 2026

ప్రభుత్వ పథకాల వారధులు వీఆర్‌ఏలే: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. మచిలీపట్నంలో శుక్రవారం ఏపీ వీఆర్‌ఏ అసోసియేషన్ రూపొందించిన నూతన క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు, గన్నవరం సభ్యులు పాల్గొని తమ విధి నిర్వహణలో ఎదురవుతున్న అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

News January 31, 2026

కొక్కెర వ్యాధి నివారణకు సూచనలు

image

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.

News January 31, 2026

బ్లూ ఎకానమీ అభివృద్ధికి విశాఖ కీలకం: జీతేంద్ర సింగ్

image

దేశ బ్లూ ఎకానమీ అభివృద్ధిలో విశాఖ తీర ప్రాంతం కీలకమని కేంద్ర సహాయ మంత్రి డా. జీతేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఏపీలో వెయ్యి కి.మీ.లకు పైగా తీరం ఉందన్నారు. విశాఖ తీరం దేశ శక్తి భద్రతకు దోహదపడుతుందన్నారు. విశాఖలో తాజాగా ప్రారంభమైన CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కేంద్రం, ONGC, ఆయిల్ ఇండియా సంస్థలతో కలిసి పనిచేస్తూ మత్స్య, పోర్టు, పారిశ్రామిక రంగాలకు శాస్త్రీయ మద్దతు అందిస్తుందని వెల్లడించారు.