News July 7, 2025

సమస్యలను త్వరగా పరిష్కరించాలి: సంగారెడ్డి కలెక్టర్

image

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజావాణి సమస్యలను పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 8, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 8, 2025

పోలీసుల ప్రతిభను గుర్తించడానికే ఈ పోటీలు: KNR సీపీ

image

KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ‘పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పేర్కొన్నారు. నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

News July 8, 2025

సిరిసిల్ల: ప్రజావాణిలో 151 దరఖాస్తులు: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో 151 దరఖాస్తులు వచ్చాయని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేశామన్నారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని ఆదేశించామన్నారు.