News April 8, 2024

సమస్యలుంటే వాట్సాప్ చేయండి: ఏలూరు కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 16.25 లక్షల ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటు హక్కు సద్వినియోగంపై జిల్లా వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మే 13న జరగబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం వాట్సాప్ నెం 94910 41435 అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే ఫొటో, వీడియోతో పై నెంబరుకు పంపాలని ప్రజలకు సూచించారు.

Similar News

News July 9, 2025

పశ్చిమ గోదావరి రెడ్ క్రాస్ సొసైటీకి ఉత్తమ జిల్లా అవార్డు

image

పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ 2022-2023 సంవత్సరానికిగాను ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. బుధవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా ఛైర్మన్ డా. భద్రిరాజు ఈ అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు.

News July 9, 2025

‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

image

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.

News July 9, 2025

ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం: కలెక్టర్ నాగరాణి

image

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్స్ జరగాలని, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.