News March 11, 2025

సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలి: కడప ఎస్పీ

image

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, న్యాయం చేయాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికల కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Similar News

News March 10, 2025

కడప: మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

వైవీయూ ఎమ్మెస్సీ పస్ట్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపల్ ప్రొ. ఎస్.రఘునాథరెడ్డి, కులసచివులు ప్రొ పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కెఎస్వీ కృష్ణారావు, డీన్ ఎ.జి.దాముతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఫలితాలు త్వరితగతిన విడుదలకు కృషిచేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు. విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News March 10, 2025

కడప: యథావిధిగా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని కడప కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను నేరుగా కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 9, 2025

ప్రొద్దుటూరులో భార్యాభర్తలను కలిపిన జడ్జి

image

ప్రొద్దుటూరు కోర్టులో నిన్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన సాంబశివా రెడ్డి శుక్రవీణను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సాప్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన భార్యాభర్తలు చిన్నపాటి వివాదంతో విడిపోయారు. భార్య జాతీయ లోక్ అదాలత్‌ను ఆశ్రయించగా జడ్జి సత్యకుమారి భర్తతో మాట్లాడారు. జడ్జి సూచనలతో భార్యాభర్తలు ఒకటయ్యారు.

error: Content is protected !!