News January 22, 2026

సమస్యల పరిష్కారమే దర్బార్ ధ్యేయం: సురేఖ

image

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయంలో 1942 నుంచి దర్బార్ కొనసాగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. దర్బార్ ప్రధాన ఉద్దేశం ఆదివాసీల సమస్యల పరిష్కారమేనని స్పష్టం చేశారు. అటవీ భూములు, పోడు భూముల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో రహదారులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Similar News

News January 27, 2026

బీజేపీ vs కాంగ్రెస్.. ‘పట్కా’ వివాదం

image

రిపబ్లిక్‌ డే వేడుకలు INC-BJP మధ్య వివాదానికి కారణమైంది. రాహుల్‌, ఖర్గేలకు <<18966146>>మూడో వరుసలో<<>> సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్‌ అవమానంగా భావిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రోటోకాల్‌ ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని BJP స్పష్టం చేసింది. మరోవైపు సాయంత్రం రాష్ట్రపతి ‘ఎట్ హోమ్‌’ కార్యక్రమంలో ముర్ము చెప్పినా ఈశాన్య ప్రాంత సంప్రదాయమైన పట్కాను (స్కార్ఫ్ వంటి వస్త్రం) రాహుల్‌ ధరించలేదంటూ మరో వివాదం చెలరేగింది.

News January 27, 2026

ఖమ్మం డీఈవో ‘చైతన్య పథం’.. తప్పు చేస్తే ‘డిస్మిస్’..!

image

ఖమ్మం DEOగా విధుల్లో చేరిన చైతన్య జైని విద్యాశాఖ ప్రక్షాళన దిశగా తీసుకుంటున్న చర్యలు ఉపాధ్యాయుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నర్సింహులగూడెం టీచర్‌ను సర్వీసు నుంచి డిస్మిస్ చేయగా.. విధి నిర్వహణలో రీల్స్ చేస్తూ, ప్రైవేటు సంస్థలను ప్రమోట్ చేస్తున్న మరో టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఒత్తిళ్లకు లొంగకుండా, విద్యాశాఖను సరిదిద్దుతున్న DEOను పలువురు అభినందిస్తున్నారు.

News January 27, 2026

BIG BREAKING: కర్నూలులో మరో బస్సు ప్రమాదం

image

కర్నూలు శివారు టిడ్కో హౌస్ దగ్గర కావేరి ట్రావెల్స్ బస్సుకు అర్ధరాత్రి మరో ప్రమాదం జరిగింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని డ్రైవర్ మరో బస్సులో పంపించారు. కాగా కర్నూలు శివారులోనే గతేడాది జరిగిన ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.