News February 9, 2026

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు: జేసీ ఇలక్కియా

image

విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘PGRS’లో ప్రజల నుంచి 192 అర్జీలను స్వీకరించినట్లు JC ఇలక్కియా తెలిపారు. అందిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. అందిన అర్జీలలో 54 రెవెన్యూ సంబంధిత అంశాలు కాగా, మిగిలిన 138 నాన్-రెవెన్యూ కేటగిరీకి చెందినవని వివరించారు. పురపాలక, పోలీసు, DRDA, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు.

Similar News

News February 14, 2026

HYD: అత్తపై అత్యాచారం.. అల్లుడికి 10ఏళ్ల జైలు

image

నాచారం PS పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడికి కుషాయిగూడ సెషన్స్ న్యాయస్థానం శిక్ష విధించింది. 2022లో అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు రమేశ్(38)కి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ వాదనలను సమర్థించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అప్పటి ఇన్‌స్పెక్టర్ మహేశ్ పకడ్బందీగా సాక్ష్యాలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.

News February 14, 2026

దుబ్బాకలో 22 ఏళ్ల కౌన్సిలర్‌

image

దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. మల్లయ్యపల్లి(1వ వార్డు) నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన 22 ఏళ్ల కోటగళ్ల రమ్య ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలువ రజితపై 241 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అతి చిన్న వయసులోనే కౌన్సిలర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించిన రమ్యను పలువురు అభినందిస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆమె తెలిపారు.

News February 14, 2026

మెదక్: ఒక్క ఓటుతో సంచలన విజయం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విచిత్రాలు జరిగాయి. మెదక్ 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి హరిత కేవలం ఒక్క ఓటుతో విజయం సాధించారు. రామాయంపేటలో దంపతులు నాగరాజు- లావణ్య, జిన్నారంలో వడ్డే కృష్ణ- లక్ష్మి, మెదక్‌లో తల్లికొడుకులు దొంతి నరేశ్, లక్ష్మి గెలుపొందారు. నర్సాపూర్ 15వ వార్డులో టాస్‌లో లలితకు గెలుపు వరించగా, డ్రా ద్వారా తూప్రాన్‌లో సత్య లింగం, ఇంద్రేశంలో లావణ్యకు అదృష్ణం వరించింది.