News June 23, 2024

సమస్యల సుడిగుండంలో మైలవలం జలాశయం

image

కడప జిల్లాలోని ప్రముఖ మైలవరం జలాశయం పాలకుల నిర్లక్ష్యంతో సమస్యలకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కడప, కర్నూలు జిల్లాల పరిధిలోని 75 గ్రామాలకు ప్రతి రోజు 0.008 టీఎంసీల నీటిని అందిస్తోంది. అయితే జలాశయంపై నిర్మించిన 2.85 కి.మీ రహదారి పాడైందని, రక్షణ గోడ సైత చాలా వరకు కూలిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.

Similar News

News January 27, 2026

ప్రొద్దుటూరు: సీఐ శ్రీరామ్‌కు లూప్ లైన్ కొత్తేమీ కాదు.!

image

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ శ్రీరామ్ కు లూప్ లైన్ అనేది కొత్తేమీ కాదు. ప్రతి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ మధ్య ఆయన్ను లూప్ లైన్లో ఉంచారు. అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో VRలో పెట్టారు. అదే జిల్లాల్లో DCRBలోను ఉంచారు. కడప, తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగంలోను ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బృందంలో కీలక అధికారిగా శ్రీరామ్ ఉన్నారు.

News January 27, 2026

ప్రొద్దుటూరు 1 టౌన్ CI బదిలీ

image

ప్రొద్దుటూరు 1 టౌన్ <<18970409>>CI శ్రీరామ్‌ బదిలీ <<>>అయ్యారు. ఒకటిన్నర నెల క్రితం ఆయన బాధ్యతలు స్వీకరించగా.. చట్టానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఆయనపట్ల అధికార పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉండగా ఆ విషయం MLA దృష్టికి తీసుకుని వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం నూతన సీఐగా TV కొండారెడ్డిని నియమిస్తూ అన్నమయ్య SP ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన RSASTF-అన్నమయ్యలో పనిచేస్తున్నారు.

News January 27, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా.
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రూ.16550.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రూ.15226.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.3580.00