News November 21, 2025
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలి: కలెక్టర్

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతితో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలతో సమావేశమయ్యారు. తక్షణమే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలని ఆదేశించారు. ఎన్నికలలో తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News November 22, 2025
26న ‘స్టూడెంట్ అసెంబ్లీ’.. వీక్షించనున్న సీఎం

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కొందరు స్పీకర్, Dy.స్పీకర్, CM, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని CM CBN, మంత్రులు వీక్షించనున్నారు.
News November 22, 2025
జనగామ: వైద్య ఆరోగ్య శాఖలో 7 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు

జనగామ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 7 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి 29, 2025 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500గా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులను సంబంధిత నిబంధనల మేరకు ఎంపిక చేయనున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దరఖాస్తులను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల వరకు పరిశీలిస్తారు.
News November 22, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సికింద్రాబాద్, దక్షిణ మధ్య రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో 61 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. అంతర్జాతీయ క్రీడల్లో Jr, సీనియర్ విభాగాల్లో పతకాలు సాధించినవారు అర్హులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడల్లో ప్రావీణ్యత, విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.


