News December 16, 2025
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత: ఎస్పీ శబరీష్

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న డోర్నకల్, కురవి, సీరోల్, కొత్తగూడ, గంగారం మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో డీఎస్పీలు(5), సీఐలు(15), ఎస్సైలు(50) సుమారు 1000 మంది సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటారని SP పేర్కొన్నారు.
Similar News
News December 25, 2025
కనుక్కోండి చూద్దాం.. వీరిలో రోహిత్ ఎవరు?

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నిన్న సిక్కింతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ <<18659152>>మెరిసిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వికెట్ కీపర్ హార్దిక్ తమోరేతో రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ కూడా రోహిత్‌లా ఉండటమే ఇందుకు కారణం. అసలైన రోహిత్‌లా హార్దిక్ తమోరే కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పేరు, జెర్సీ నంబర్ లేకపోతే కనిపెట్టలేమని అంటున్నారు. మరి మీరేమంటారు?
News December 25, 2025
VJA: వీడు మూమూలోడు కాదు.. కాలేజీలే టార్గెట్!

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. SEPలో విజయవాడ కోర్టు నుంచి తీసుకొస్తుండగా ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు సమాచారం. కాలేజీ స్టూడెంట్‌లా కళాశాలల్లో అడ్మిషన్ డబ్బులు, చర్చిలే లక్ష్యంగా చోరీల చేస్తాడు. గతంలో ఇతను హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో కాల్పులకు సైతం తెగపడినట్లు తెలుస్తోంది.
News December 25, 2025
మహిళలపై కంట్రోల్ కోసమే ఇదంతా: అనసూయ

పాత తరాలు అలవాటుపడ్డ ఆలోచనలను మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని నటి <<18662962>>అనసూయ<<>> పేర్కొన్నారు. ‘కొంతమంది వయసు ఆధారంగా నన్ను తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆలోచనున్న వాళ్లు ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం, బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది’ అని ట్వీట్ చేశారు.


