News August 17, 2025

సమస్య ఉంటే ఫోన్ చెయ్యండి: విశాఖ మేయర్

image

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేరుగా తనకు తెలియజేయాలని మేయర్ పీలా శ్రీనివాసరావు కోరారు. గ్రేటర్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు, కొండవాలు, తీర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా 99668 29999 నంబరుకు వెంటనే సంప్రదించాలని సూచించారు.

Similar News

News August 17, 2025

రేపు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు: డీఈవో

image

విశాఖలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సెలవిచ్చినట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విషయాన్ని గమనించాలని సూచించారు.

News August 17, 2025

సింహాచలంలో 22న ఆర్జిత సేవలు రద్దు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో 22వ తేదీన ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వి.త్రినాథ్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆరోజు సుప్రభాతం, ఆరాధన, లక్ష కుంకుమార్చన సేవలు మినహా మిగతా ఆర్జిత సేవలు అయిన నిత్య కళ్యాణం, గరుడ వాహన సేవ, సహస్రనామార్చన మొదలైన సేవలను రద్దు చేసినట్టు తెలిపారు.

News August 17, 2025

సింహాచలంలో కొండ పైకి ఆ రోజున ఫ్రీ బస్సు సౌకర్యం

image

సింహాచలం అప్పన్న దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వి.త్రినాథ్ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 18వ తేదీన కొండపైన PRO ఆఫీసులో ఆధార్ కార్డు చూపించి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలా వచ్చిన వారికి వ్రతం రోజు కొండ క్రింద నుండి పైకి, పైనుండి కిందకి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.