News December 31, 2025
సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బనగానపల్లి రెవెన్యూ డివిజన్ బుధవారం నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. కొత్త డివిజన్ ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.
Similar News
News February 12, 2026
HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.
News February 12, 2026
నిజామాబాద్: వార్ వన్ సైడ్… లేక హంగ్..?

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీజేపీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం 60 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చాలా దగ్గర బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు 20కి అటు ఇటుగా, MIMకు 10కి పైబడి డివిజన్లు వచ్చే అవకాశం ఉందని, అయితే మేయర్ ఎన్నిక నాటికి ఎక్స్‌అఫీషియో ఓట్లు, ఇతర సమీకరణాలు కీలకమవుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
News February 12, 2026
అమెరికాలో అమరరాజా కంపెనీ ఏర్పాటు..?

బ్యాటరీ రంగంలో దూసుకెళ్తున్న అమరరాజా మరో అడుగు ముందుకు వేసింది. ‘అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ యూఎస్ ఇంక్’ పేరుతో అక్కడ సంస్థ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. వచ్చే ఐదారు నెలల్లోనే ఈ సంస్థ ఏర్పాటు కానుండగా.. దాదాపు 50లక్షల డాలర్లు(రూ.45కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. మరోవైపు మూడో త్రైమాసికంలో అమరరాజా రూ.140 కోట్ల లాభాలు పొందింది.


