News October 10, 2025

సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలి: కలెక్టర్

image

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం – 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలన్నారు.

Similar News

News October 10, 2025

సంగారెడ్డి: భగీరథ నీటి సరఫరా బంద్

image

సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, కోహిర్, ఝరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, కంది, సదాశివపేట, కొండాపూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, పటాన్‌చెరు మండలాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఈ విజయలక్ష్మి తెలిపారు. సింగూరు ఆనకట్ట సమీపంలోని బూసరెడ్డిపల్లి నీటి శుద్ధి కర్మాగారంలో మరమ్మతుల కారణంగా శనివారం మ. 12 గంటల నుంచి ఆదివారం సాం. 8 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు.

News October 10, 2025

బ్రహ్మసముద్రంలో కేజీబీవీ విద్యార్థి మృతి

image

బ్రహ్మసముద్రం కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న చందన శుక్రవారం మృతి చెందిందినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. వారి వివరాల మేరకు.. పడమటి కోడిపల్లి గొల్లల దొడ్డికి చెందిన చందన కేజీబీవీలో చదువుతోంది. కడుపు నొప్పి అధికంగా ఉందని SO మహాలక్ష్మికి చెప్పింది. చందనను SO, తల్లిదండ్రులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 10, 2025

రేపు దేవళంపేటలో పర్యటించనున్న మంత్రి

image

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.