News July 10, 2025
సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి: కలెక్టర్

సమాజ భాగస్వామ్యం ద్వారానే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. గురువారం అల్లవరం మండలం పేరూరులోని ఓ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పీటీఎంను పరిశీలించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యాభివృద్ధిలో సమాజం కీలక భాగస్వామి కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News July 11, 2025
మేడ్చల్: ‘రేషన్ కార్డులకు ఈ కెవైసీ పూర్తి చేయాలి’

మేడ్చల్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం E-KYC పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,37,810 కార్డుల్లోని 18,65,353 మంది లబ్ధిదారులకుగానూ 13,19,111 (70.72%) లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగిలిన 5,46,242 (29.28%) లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.
News July 11, 2025
కానిస్టేబుల్ వైష్ణవి సేవలను అభినందించిన CP

రాచకొండ కమిషనర్ సుదీర్‌బాబు తలపెట్టిన విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబర్ అవగాహన కల్పిస్తున్న ఎల్బీనగర్ కానిస్టేబుల్ వైష్ణవిని ప్రశంసించారు. ప్రజలకు సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను గుర్తించి, తన క్యాంప్ కార్యాలయంలో రివార్డు అందజేశారు. బీటెక్ చేసిన వైష్ణవి 2024 బ్యాచ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు.
News July 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అన్ని మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల, రేషన్ కార్డుల వేరిఫికేషన్, భూ భారతి దరఖాస్తుల పరిస్కారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించారు.