News November 26, 2025
సమీకృత వ్యవసాయ యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్

లక్ష్మీదేవిపల్లి లోతువాగు గ్రామంలో పడిగ అపర్ణ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ యూనిట్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం సందర్శించారు. అవలంబిస్తున్న పద్ధతులు, మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌజు పిట్టలు, నాటు కోళ్లు, బాతులు, కొరమీను, మేకలు, కూరగాయలు, మునగ సాగు వివరాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీవో విద్యచందన పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.
News December 1, 2025
ప్రకాశం: DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

జలదంకి(M) లింగరాజు అగ్రహారానికి చెందిన అన్నం కార్తిక్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం(M) మున్నూరుకు చెందిన సూరగం ప్రసన్న ప్రేమించుకున్నారు. వీరు ఇద్దరు మేజర్‌లు కావటంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా కావలి పీజీ సెంటర్ వద్ద ఉన్న శ్రీమాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో కావలి డీఎస్పీని ఆదివారం కలిసి రక్షణ కల్పించాలని కోరారు.
News December 1, 2025
హుస్నాబాద్: ‘మా ఓటు విలువైనది.. అమ్మబడదు’

హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన భోజ అనిల్ కుమార్ ఫ్యామిలీ తమ ఇంటి ముందు ‘ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు- ఆ ఓటును మేము అమ్ముకోము’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వారు చేసిన ఈ పనిని చూసి అందరూ సూపర్బ్ అంటున్నారు. ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని వారు అంటున్నారు.


