News January 1, 2025
సమీపిస్తున్న మినీ మేడారం జాతర!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో మన జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
Similar News
News January 4, 2025
నెరవేరిన పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజి కల!
పారాలింపిక్స్ మెడల్ సాధించిన సమయంలో దీప్తి జీవాంజిని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మీకేం కావాలని అడగగా.. మెగాస్టార్ చిరంజీవిని కలవాలని ఉందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం అకాడమీలో మెగాస్టార్ చిరంజీవిని దీప్తి కలిసి తన కలను నెరవేర్చుకున్నారు. కాగా, పర్వతగిరి(M) కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అర్జున అవార్డుకి ఎంపికవడం వరంగల్ జిల్లాకే గర్వకారణమని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 4, 2025
జిల్లా సమగ్రాభివృద్ధిలో పాత్రికేయుల సహకారం అవసరం: WGL కలెక్టర్
జిల్లా సమగ్రాభివృద్ధిలో పాత్రికేయుల సహకారం అవసరమని కలెక్టర్ సత్య శారదా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో పాత్రికేయులతో(ముఖా ముఖి) కార్యక్రమం నిర్వహించారు. పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నారని.. జిల్లాలో ప్రజలు ఎలాంటి సమస్యలకు గురైన పాత్రికేయులు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
News January 3, 2025
వరంగల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా మంత్రులు
సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు. సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ జీవో జారీ చేసినందుకు సీఎంను మంత్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.