News December 29, 2024
సముద్రంలో ఈదుకుంటూ విశాఖ నుంచి కాకినాడకు
విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఈదుతూ ప్రయాణించేందుకు శ్యామల గోలి సాహసయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా విశాఖ ఎంపీ శ్రీభరత్, గండి బాబ్జి పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాహస యాత్ర ఆమె ఆత్మవిశ్వాసానికి, మహిళల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఒక్క రోజులో దాదాపు 30 కిలోమీటర్లు పాటు ఈదుతూ 5 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్యామల గోలి ప్రణాళిక రూపొందించారు.
Similar News
News January 1, 2025
విశాఖ జైల్లో బయటపడిన ఫోన్లు అతనివేనా?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ మాజీ MP ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో కీలక ముద్దాయి కోలా హేమంత్ కుమార్ కదలికలపై జైలు అధికారులు నిఘా పెట్టారు. ఈ మేరకు సెంట్రల్ జైలులో అతని వద్ద 3సెల్ ఫోన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జైల్లో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఫోన్లు బయటపడటం చర్చనీయాంశమైంది. ఎవరు లోపలికి తీసుకొచ్చారు, ఎన్ని రోజులుగా వాడుతున్నారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News January 1, 2025
విశాఖ: ‘గుడ్లు కూడా క్యాచ్ అంటూ విసిరేవాడు’
విశాఖ కుర్రాడు నితీశ్ సెంచరీ చేయడంపై అతని చిన్నప్పటి కోచ్ కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. నితీశ్‌కు 8 ఏళ్లు ఉన్నప్పుడు అతని తండ్రి ముత్యాల నాయుడు తన దగ్గరకు తీసుకొచ్చాడని చెప్పారు. ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నాడు.. చివరికి కోడి గుడ్లు కూడా క్యాచ్ అంటూ విసురుతున్నాడు కోచింగ్ ఇవ్వండి అన్నారని తెలిపారు. నితీశ్ ఆట చూసి అప్పుడే తన ఆటోగ్రాఫ్‌ను బ్యాట్ పై తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News January 1, 2025
సింహాచలంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు
జనవరి 10న సింహాచలంలో జరగబోయే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలను ఈఓ త్రినాథరావు మంగళవారం పర్యవేక్షించారు. ఆరోజు పెద్దఎత్తున్న భక్తులు రావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. వైదిక కార్యక్రమాలు, విద్యుత్ దీపాలంకరణ, భక్తులకు మంచినీటి సరఫరా, సీసీ కెమెరాలు ఏర్పాటు, బార్కేడింగ్, క్యూలైన్లు ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధికారులకు సూచనలు చేశారు.