News August 28, 2025
సముద్రపు నాచుతో అదనపు ఆదాయం: కలెక్టర్

సముద్రపు నాచు సాగు ద్వారా ఎస్‌హెచ్‌జీలు అదనపు ఆదాయం ఆర్జించడానికి తోడ్పాటునందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం నరసాపురం మండలం పెద్దమైనవానిలంక డిజిటల్ భవన్ నందు జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ సహకారంతో ఎస్‌హెచ్‌జి మహిళలకు అందిస్తున్న సముద్రపునాచు సాగు శిక్షణా తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Similar News
News August 29, 2025
యలమంచిలి: గోదావరిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

యలమంచిలి మండలం చించినాడ పుష్కర ఘాట్‌లో స్నానానికి దిగి డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గ్రామానికి చెందిన వేగి మోహనరావు (42) మృతి చెందినట్లు ఎస్ఐ కే.గుర్రయ్య తెలిపారు. ఈ నెల 25వ తేదీన స్నానానికి దిగిన మెహనరావు ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయాడన్నారు. గురువారం దర్బరేవు వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైందని చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News August 29, 2025
అత్తిలి: దైవ దర్శనానికి వెళ్తుండగా చెట్టు మీద పడి వ్యక్తి మృతి

ద్వారకాతిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్న ఆ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడింది. అత్తిలికి చెందిన వెంకట సుబ్బారావు తన భార్య నాగదుర్గవేణి, కుమారుడితో కలిసి బైక్‌పై చినవెంకన్న దర్శనానికి వెళ్తున్నారు. ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట సమీపంలో వర్షం ధాటికి ఓ చెట్టు కుప్పకూలి వారిపై పడింది. ఘటనలో సుబ్బారావు మృతి చెందగా భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. SI సుధీర్ కేసు నమోదు చేశారు.
News August 29, 2025
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.