News August 22, 2025
‘సముద్ర రంగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా విశాఖ’

సముద్ర రంగంలో విశాఖను నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు కోరారు. విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన సదస్సులో మాట్లాడారు. సముద్ర రంగంలో విశాఖ రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. పోర్టు ఆధారిత తయారీ రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.
Similar News
News August 22, 2025
భీమిలి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

భీమిలి ప్రాంతంలోని బోయవీధికి చెందిన చింతపల్లి రాము వేటకు వెళ్లి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రాము తెప్పపై వేటకు వెళ్ళగా అలల ఉధృతికి మునిగిపోయినట్లు మత్స్యకార డెవలప్మెంట్ అధికారి రాజు తెలిపారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News August 22, 2025
విశాఖ: సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు

విశాఖ జాలరిపేటకు చెందిన బోటు సముద్రంలో 2 రోజుల క్రితం మునిగిపోగా మత్స్యకారులు మరో బోటు సాయంతో ఒడ్డుకు చేరుకున్నారు. మరపడవల సంఘం కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడారు. 22వ తేదీన ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్ళగా బోటులో నీరు చేరుకోవడంతో ప్రమాదం జరిగి మునిగిపోయిందన్నారు. అక్కడే ఉన్న మరోబోట్ సహాయంతో ఒడ్డుకు చేరుకున్నామని మత్స్యకారులు తులసిరావు, రమేష్, హరికృష్ణ, గురుమూర్తి తెలిపారు.
News August 22, 2025
కన్న కూతుర్లపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

రక్షించాల్సిన తండ్రే కన్న కూతుర్ల పాలిట కాలయముడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆరిలోవలో ఉంటోన్న ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్ల (మైనర్ల)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించేవాడు. ఈ అఘాయత్యం తెలుసుకున్న తల్లి గత ఏడాది ఆరిలోవలో ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.