News February 11, 2025
సముద్ర స్నానాలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739200033145_52225865-normal-WIFI.webp)
ఈ నెల 12వ తేదీన మాఘ పౌర్ణమి పండుగ పురస్కరించుకొని జిల్లాలో ప్రజలు పుణ్యస్నానాలు చేసే ప్రదేశాలలో ప్రజలకు అసవరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మాఘ పౌర్ణమి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News February 11, 2025
NRPT జిల్లాలో అత్యధిక, అత్యల్ప ఎంపీటీసీ సీట్లు ఎక్కడో తెలుసా..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739247140756_50253107-normal-WIFI.webp)
నారాయణపేట జిల్లాలో ఎంపీటీసీల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట మండలంలో 17, ఉట్కూర్, దామరగిద్దలో 16, మక్తల్ 15, మరికల్, ధన్వాడలో 11, మద్దూర్ 10, నర్వ 9, మాగనూర్, కృష్ణ లో 7, గుండుమల్, కోస్గి లో 6, కొత్తపల్లి 5 ఎంపీటీసీ సీట్లు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో మొత్తం 136 ఎంపీటీసీ స్థానాలకు, 13 జడ్పీటీసీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆశావహుల సంఖ్య అన్ని పార్టీల్లో ఎక్కువగా ఉంది.
News February 11, 2025
సిద్దిపేట: వేర్వేరుగా ముగ్గురు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739248553492_1243-normal-WIFI.webp)
సిద్దిపేట జిల్లాల్లో వేర్వేరుగా ముగ్గురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కోహెడలో జీవితంపై విరక్తితో తిరుపతి రెడ్డి(50) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. హుస్నాబాద్‌లో కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని రాజు(45) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. గజ్వేల్ మండల పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో రవీందర్(35) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
News February 11, 2025
DANGER: ఈ ఫుడ్ కలర్ వాడితే క్యాన్సర్ రావొచ్చు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252149089_746-normal-WIFI.webp)
అమెరికాలో బ్యాన్ చేసిన ‘RED DYE #3’ ఫుడ్ కలర్‌ను చీప్‌గా వస్తోందని ఇండియాలోని చాలా కంపెనీలు వాడుతున్నాయి. ఈ రంగును చాక్లెట్స్, డ్రింక్స్, కేకుల్లో వాడుతుంటారు. ఇది హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘RED DYE #3’ ఎలుకపై టెస్ట్ చేయగా అది క్యాన్సర్‌కు దారితీసింది. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, ఎలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రొడక్ట్ లేబుల్ చెక్ చేసి దానిలో ‘RED3’ అని ఉంటే వాటిని కొనకండి.