News January 18, 2026
సమ్మక్క తల్లి చిలుకలుగుట్ట వద్ద OLD PHOTO

మహా కుంభమేళ మేడారం జాతరలో కోటిమంది భక్తుల ఎదురుచూపు సమ్మక్క తల్లి కోసమే. పూర్వీకుల నుంచి చిలుకలగుట్ట వద్దకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుని సమ్మక్క రాకకై ఎదురుచూస్తుంటారు. గుట్ట దిగెటప్పుడు కనులారా చూసేందుకు అక్కడే ఉన్న చెట్లపై ఎక్కి సమ్మక్క దర్శనం చేసుకుని తరించిపోతారు. పూర్వం సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటప్పుడు పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేసి తీసుకెళ్తున్న దృశ్యం.
Similar News
News February 17, 2026
ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆనంద్ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు నమిలి మింగాలని సూచించారు. సంవత్సరంలో రెండు సార్లు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగులు నశిస్తాయని తెలిపారు. పలువురు విద్యార్థులు ఇక్కడికి చేరుకొని మాత్రలు స్వీకరించారు.
News February 17, 2026
BREAKING: ఐబొమ్మ రవికి బెయిల్

TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉ.11 గంటలకు సీపీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చిచెప్పింది. సినిమాల పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న రవి అరెస్టయిన విషయం తెలిసిందే.
News February 17, 2026
చెస్ పోటీలు ప్రారంభించిన కలెక్టర్, ఎంపీ

అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శాప్ లీగ్–2026 చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ ఆనంద్ హాజరై వీటిని ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. జిల్లా నుంచి ప్రతిభావంతులు వెలుగులోకి రావాలన్నారు. పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి చేరుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు.


