News January 4, 2026

సమ్మక్క, సారలమ్మ గద్దెలపై హుండీల ఏర్పాటు

image

మేడారం మహా జాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. జాతరకు ముందే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్ల గద్దెలపై ముందస్తుగా పూజారులు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీలు ఏర్పాటు చేశారు. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజుల గద్దెలపై హుండీలను సీల్ వేసి ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News January 7, 2026

గోదావరిఖనిలో 75 రోజుల్లో క్యాత్ లాబ్..!

image

గోదావరిఖనిలో 75 రోజుల్లో క్యాత్ లాబ్ (మెడికల్ బెనిఫిట్స్) ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్స్, పారామెడికల్ పోస్టులు నెల చివరికి భర్తీ చేయనున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 లక్షల వరకు మందులు, సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి బీమా సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో తెలిపారు.

News January 7, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం సోదరుడికి సిట్ పిలుపు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులిచ్చింది. గతంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రేపు ఉదయం సిట్ ఎదుట హాజరుకావాలని సూచించారు.

News January 7, 2026

మొలతాడు కట్టుకోవడం వెనుక సైన్స్ ఇదే..

image

మొలతాడు కట్టుకోవడం వెనుక శాస్త్రీయ, ఆరోగ్య కారణాలున్నాయి. ఇది శరీరంలోని అవయవాల పెరుగుదలను క్రమబద్ధంగా ఉంచుతుంది. హెర్నియా వంటి సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. నడుం చుట్టూ ఉండే నరాలపై ఒత్తిడి కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని శక్తిని వృథా కాకుండా కాపాడుతుందని నమ్ముతారు. నలుపు, ఎరుపు రంగు దారాలు దిష్టి తగలకుండా రక్షణ కవచంలానూ పనిచేస్తాయి. వెండి మొలతాడు ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్మకం.