News August 22, 2025

సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపండి: కడప కలెక్టర్

image

వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలవనరులను సంరక్షించుకునే చర్యలను చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు. వర్షా కాలంలో నీటి నిల్వ కారణంగా ఇసుక సేకరణ సాధ్యం కాదని.. ఇప్పటి నుంచే అవసరమైన మేర ఇసుక నిల్వలను పెంచుకోవాలని సూచించారు.

Similar News

News August 22, 2025

పులివెందుల ఉప ఎన్నికపై ఫిర్యాదు

image

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అక్రమాలు చేసిందని 4వ వార్డు కౌన్సిలర్ పార్లపల్లి కిషోర్ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను అరకు ఎంపీతో కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటర్లను అడ్డుకున్నారని చెప్పారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలు ఓటు వేయనీయకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేశారని. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News August 22, 2025

కడప: లవ్ ఫెయిల్.. లవర్స్ సూసైడ్

image

ఈ ఘటన ప్రొద్దుటూరు మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. ఇడమడకకు చెందిన వినోద్ కుమార్(26) ప్రొద్దుటూరుకు చెందిన యువతిని ప్రేమించాడు. వీళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఈక్రమంలో యువతి ఆగస్ట్ 15వ తేదీని ఉరేసుకుని చనిపోయింది. ఇది తట్టుకోలేని వినోద్ బుధవారం రాత్రి విషం తాగాడు. చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు.

News August 22, 2025

కడప: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గమనిక

image

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ల పరిశీలనకు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ సమయంలో జతపరిచిన ఒరిజినల్ డాక్యుమెంట్లను, గజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, ఇటీవల తీసుకున్న 6 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలను తీసుకురావాలని సూచించారు.