News March 26, 2026
సమ్మర్ స్పెషల్: మీ పిల్లలను ఛాంపియన్లుగా మార్చండి!

వేసవి సెలవుల్లో పిల్లల సమయాన్ని వృథా చేయకుండా ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. ముఖ్యంగా పిల్లల శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ నేర్పించడం వల్ల శరీరం చల్లబడటమే కాక మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే ఏకాగ్రత కోసం యోగా, మెడిటేషన్.. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇవి పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తాయి. <<-se>>#SummerSPL<<>>
Similar News
News April 8, 2026
మేం కూలీలం: షమీ

‘మేం కూలీలం. మా పని బౌలింగ్ చేయడమే’ అంటూ పేసర్ షమీ తన మనసు విప్పారు. జీవితంలో గాయాలు, ఎత్తుపల్లాలు సహజమని.. గ్రౌండ్ లెవల్‌లో చేసే కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని కుర్రాళ్లకు సూచించారు. అందరూ ఫ్యాన్సీ విషయాల వెనుక పడితే అదే బలహీనత అవుతుందని హెచ్చరించారు. డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొడుతున్నా టీమ్ఇండియాలో షమీకి చోటు దక్కడం లేదు. అయినా ఆయన పాజిటివ్ ఆటిట్యూడ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
News April 8, 2026
వెంటనే ఇరాన్‌ను వీడండి: భారత ఎంబసీ

ఇరాన్‌లో ఉంటున్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయటపడాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇందుకోసం ఎంబసీ సాయం తీసుకోవాలని, సూచించిన రూట్లలో వెళ్లాలని కోరింది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా అంతర్జాతీయ భూ సరిహద్దులకు వెళ్లొద్దంది. ఈ మేరకు హెల్ప్‌లైన్ నంబర్ల(+989128109115; +989128109109; +989128109102; +989932179359)లో సంప్రదించాలంది. సీజ్‌ఫైర్ అయిన కొన్ని గంటలకే ఈ ప్రకటన రావడం గమనార్హం.
News April 8, 2026
పాకిస్థాన్‌ను ఇరాన్ ఎందుకు నమ్మింది?

అరబ్ దేశాలకు అమెరికాతో మంచి సంబంధాలు ఉండటం, సైనికులకు ఆశ్రయం ఇవ్వడంతో ఇరాన్ వాటిని నమ్మలేదు. ఇరాన్‌తో పాకిస్థాన్ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇరాన్ మంత్రి అరాఘ్చీ.. షరీఫ్, మునీర్‌ను ‘ప్రియమైన సోదరులు’ అని సంబోధించారు కూడా. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌తో పాక్‌కు మెరుగైన సంబంధాలు లేకపోవడం అతి ముఖ్య కారణం.


