News April 16, 2025

సమ్మర్ హాలీడేస్.. అనకాపల్లిలో చూడదగ్గ ప్రదేశాలు

image

వేసవి సెలవుల్లో అనకాపల్లి జిల్లాలో సందర్శించేందుకు పలు పర్యాటక కేంద్రాలు స్వాగతం పలుకుతున్నాయి. అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ ప్రకృతి అందాలతో అలరారుతుంది. ఆవలో బోటు షికారు మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది. ప్రముఖ దేవాలయంగా పేరుగాంచిన అనకాపల్లి నూకాంబిక ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలి. నాతవరం మండలం తాండవ రిజర్వాయర్, ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం బీచ్‌లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

Similar News

News April 16, 2025

ఏపీకి అండగా ఉండండి: CM విజ్ఞప్తి

image

APకి కీలకమైన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానానికి నిధులు ఇవ్వాలని CM చంద్రబాబు 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్, తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి నిధులు కోరారు. అమరావతి, తిరుపతి, విశాఖలను గ్రోత్ సెంటర్లుగా మార్చేందుకు గ్రాంట్లు, పోర్టులు, హార్బర్లు, లాజిస్టిక్ పార్కులు, ఎయిర్‌పోర్టులు నిర్మించేలా సాయానికి విజ్ఞప్తి చేశారు.

News April 16, 2025

పానగల్: విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలి: డీఈవో 

image

వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఛైర్మన్లు కృషి చేయాలని వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని స్పష్టం చేశారు. బుధవారం పానగల్ మండల కేంద్రంలో నిర్వహించిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఛైర్మన్ల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్లు అందరూ కృషి చేసి గత సంవత్సరం కంటే వచ్చే ఏడాది విద్యార్థుల నమోదు పెంచాలన్నారు.

News April 16, 2025

ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారన్న ప్రచారం అవాస్తవం: శ్రీనాథ్

image

చౌక ధరల దుకాణాల్లో ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్ తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తే  క్రిమినల్ కేసుల నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో చౌక దుకాణాల ద్వారా ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో  జరుగుతున్న దుష్ప్రచారంపై ఒక ప్రకటన విడుదల చేశారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. 

error: Content is protected !!