News December 27, 2024
సమ్మిళిత వృద్ధి సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలి: కలెక్టర్
స్వర్ణాంధ్ర 2047 సాకారం దిశగా అమలుచేస్తున్న ప్రణాళికలు మంచి ఫలితాలు ఇవ్వడంలో, అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.
Similar News
News December 28, 2024
తెలుగును చిన్నచూపు చూస్తున్నారు: ఎన్వీ రమణ
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు తెలుగుభాషా అభివృద్ధికి ఏ ప్రభుత్వం పనిచేయలేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. విజయవాడ కేబిఎన్‌లో జరుగుతున్న తెలుగు రచయితల మహాసభలో శనివారం ఆయన మాట్లాడారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరాయి భాషకు పట్టం కడుతున్నారన్నారు. ఆంగ్లం ద్వారానే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలో ఉన్నారన్నారు.
News December 28, 2024
విజయవాడలో ప్రారంభమైన తెలుగు మహాసభలు
ప్రపంచ 6వ తెలుగు మహాసభలు శనివారం విజయవాడలోని KBN కాలేజీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు నిర్వాహకులు 3 సభావేదికలు సిద్ధం చేశారు. సుప్రీం కోర్టు మాజీ CJI ఎన్వీ రమణ, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవిదేశాల నుంచి 1500 మందికిపైగా కవులు, రచయితలు ఈ సభలకు తరలివచ్చారు.
News December 28, 2024
ఇబ్రహీంపట్నం: బాలికపై పాస్టర్ అత్యాచారం.. కేసు నమోదు
బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్‌ని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొండపల్లిలో నివాసముంటున్న బాలిక కుటుంబానికి పాస్టర్ దగ్గరి బంధువు. తెలంగాణ నుంచి అప్పుడప్పుడు కొండపల్లిలోని బాలిక నివాసానికి వచ్చి అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.