News April 12, 2025

‘సరస్వతి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలి’

image

సరస్వతి పుష్కరాలను సమన్వయంతో, అన్ని విభాగాల అధికారులు టీమ్‌వర్క్‌తో విజయవంతంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డిలతో కలిసి భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఇతర శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News November 15, 2025

WGL: వరుస రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

image

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భూపాలపల్లి జిల్లాలో రాజయ్య బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. రఘునాథపల్లి వద్ద గూడ్స్ వాహనం ఢీకొనగా రాపాక వినోద్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దుగ్గొండి దగ్గర గృహప్రవేశానికి వెళ్తున్న హనుమాయమ్మ లారీ ఢీకొనడంతో మృతి చెందింది. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు సహా గాయపడ్డారు.

News November 15, 2025

ప్రతి 20KM కు EVఛార్జింగ్ స్టేషన్ కోసం కసరత్తు

image

జిల్లాలో EV వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు కసరత్తు మొదలైంది. జాతీయ రహదారులపై ప్రతి 20KM కు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. PMఈ-డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేసే ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లకు 80% రాయితీ లభిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 25 స్థలాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

News November 15, 2025

కఠోర శ్రమతోనే లక్ష్య సాధన: కలెక్టర్

image

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె మాట్లాడుతూ.. బాలబాలికలు అనవసర విషయాలను పట్టించుకోకుండా, తమ ధ్యాసనంతా చదువుపైనే కేంద్రీకరించాలని సూచించారు.