News November 7, 2025

సరస్వతీ దేవి ఎలా జన్మించింది?

image

పూర్వం సృష్టి శూన్యంగా ఉండేది. దీంతో బ్రహ్మ దేవుడు లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ కార్యాన్ని ప్రారంభించడానికి అతనికి జ్ఞానం, వాక్కు అవసరమయ్యాయి. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుంచి తేజోమయి సరస్వతీ దేవిని సృష్టించాడు. ఆమె వీణ, పుస్తకం, జపమాల ధరించి, ఆవిర్భవించింది. బ్రహ్మకు వాక్కు, జ్ఞానం అందించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ వేదాలను, సమస్త విశ్వాన్ని సృష్టించగలిగాడు. అందుకే బ్రహ్మ మానస పుత్రిక అంటారు.

Similar News

News November 7, 2025

రైనా, ధవన్‌.. వీళ్లేం సెలబ్రిటీలు?: సజ్జనార్

image

TG: బెట్టింగ్ యాప్‌లకు <<18217144>>ప్రమోషన్<<>> చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌పై HYD సీపీ సజ్జనార్ ఫైరయ్యారు. ‘అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ బారిన పడి ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? వీళ్లేం సెలబ్రిటీలు?’ అని ట్వీట్ చేశారు.

News November 7, 2025

వంటింటి చిట్కాలు

image

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్‌ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.

News November 7, 2025

కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

image

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.