News January 15, 2026
సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News February 9, 2026
మంగళగిరిలో మేఘాలయ బృందం పర్యటన

‘ఎనీమియా ముక్త్ భారత్’ పరిశీలన ఆంధ్రప్రదేశ్‌లో’ ఎనీమియా ముక్త్ భారత్’ అమలు తీరును పరిశీలించేందుకు మేఘాలయ NHM ఉన్నతాధికారుల బృందం సోమవారం మంగళగిరిలో పర్యటించింది. స్థానిక ఉన్నత పాఠశాల, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రక్తహీనత నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో AP అగ్రస్థానంలో ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చామని అధికారులు తెలిపారు. రేపు అంగన్వాడీ, PHCలను ఈ బృందం సందర్శించనుంది.
News February 9, 2026
గుంటూరులో ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు

గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరుగుతున్న “భారత రంగ్ మహోత్సవ్-అంతర్జాతీయ నాటకోత్సవాలు” సోమవారంతో 4వ రోజుకు చేరాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తెలుగు నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొని సీనియర్ కళాకారులను ప్రత్యేకంగా సత్కరించారు.
News February 9, 2026
రైతుల కోసం ఉబర్ తరహాలో డ్రోన్ సేవలు: కలెక్టర్

ఉబర్ తరహాలో డ్రోన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రైతుల అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉబర్ క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అంతటా సేవలు లభిస్తాయని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు డ్రోన్ ద్వారా చల్లడం వంటి ప్రయోజనాలు పొందవచ్చన్నారు.


