News January 27, 2026
సరికొత్తగా ఆధార్ యాప్.. సేవలు సులభతరం

ఆధార్ కార్డులో మొబైల్ నంబర్‌ను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ యాప్‌లో అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని UIDAI కల్పించింది. రేపటి నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకింగ్ సేవల కోసం ఆధార్-మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి. అలాగే ట్రావెలింగ్‌లో ఐడెంటిటీ చెకింగ్స్ వేగంగా పూర్తయ్యేలా ఆధార్ యాప్ కొత్త వెర్షన్ రేపే అందుబాటులోకి రానుంది. దీంతో ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం ఉండదు.
Similar News
News February 20, 2026
పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఇవి పొలాలు, తోటల్లో చేరి మొక్కల ఆకులు, కాయలు, పండ్లను తినడం వల్ల తీవ్ర పంట నష్టం కలగడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, మామిడి, అరటి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, వంగ, దోస, క్యాబేజి, బెండ, మల్బరీ, బంతి తోటల్లో వీటి ముప్పు ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.
News February 20, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 28 పోస్టులు

CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 28 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 11, 12తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, MMV, డ్రాఫ్స్‌మెన్ మెకానికల్‌కు నెలకు స్టైపెండ్ రూ.10,560, వెల్డర్‌కు రూ.9600 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in
News February 20, 2026
శుక్రవార వ్రతం ఎప్పుడు ప్రారంభించాలంటే?

సంతోషీ మాత వ్రతాన్ని ప్రారంభించడానికి సరైన సమయం ఏ నెలలోనైనా వచ్చే శుక్ల పక్ష శుక్రవారం. చంద్రుని వృద్ధి చెందే కాలమైన శుక్ల పక్షంలో వ్రతాన్ని మొదలుపెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా ప్రారంభించిన వ్రతాన్ని మధ్యలో విరామం లేకుండా వరుసగా 16 శుక్రవారాల పాటు కొనసాగించాలి. అనివార్య కారణాల వల్ల ఏదైనా వారం వ్రతం చేయలేకపోతే ఆ వారాన్ని వదిలేసి తదుపరి వారం నుంచి తిరిగి కొనసాగించాలి. మొత్తం 16 వారాలు చేయాలి.


