News November 16, 2025

సరికొత్త రీతిలో మోసాలు.. జాగ్రత్త: ADB SP

image

సైబర్ నేరగాళ్లు సరికొత్త రీతీలో మోసం చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. గతవారం జిల్లాలో 11 కేసులో నమోదైనట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ జాబ్స్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్, లోన్ ఇస్తామంటూ వచ్చే యాడ్స్ నమ్మవద్దని వివరించారు. రూ.2 నోటుకు రూ.32 లక్షలు ఇస్తామంటూ వచ్చే ప్రచారాలు అవాస్తవమని వాటిని నమ్మకూడదన్నారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News November 16, 2025

ఏలూరులో డెడ్ బాడీ కలకలం

image

ఏలూరు రెండో పట్టణ పరిధిలోని బడేటి వారి వీధిలో ఓ దుకాణం ఎదుట డెడ్ బాడీ ఆదివారం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్ఐ మధు వెంకటరాజా పరిశీలించి అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇతడి వివరాలు తెలిసిన వారు ఏలూరు టూ టౌన్ సీఐ 94407 96606, టూ టౌన్ ఎస్ఐ 99488 90429 నంబర్లకు సంప్రదించాలన్నారు.

News November 16, 2025

రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

image

నందికొట్కూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10 ఆపై చదివినవారు అర్హులన్నారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీతం రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపువారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 16, 2025

HYD అమ్మాయితో iBOMMA రవి లవ్ మ్యారేజ్!

image

iBOMMA రవి గురించి ఆయన తండ్రి అప్పారావు పలు విషయాలు చెప్పారు. ‘ఎందుకు ఇలా చేశాడో తెలియదు. రాంగ్‌రూట్‌లో వెళ్లాడు. మేము చూసిన పిల్లను వద్దు అన్నాడు. తనకిష్టమని HYD అమ్మాయి నగ్మను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకొని ఇప్పుడు విడాకులు తీసుకున్నాడు.’ అని అప్పారావు పేర్కొన్నారు. అయితే, కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టా వాసులకు రవి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నట్లు సమాచారం.