News December 27, 2025

సరిగ్గా నిద్ర పోవట్లేదా..?

image

నైట్ ఔట్‌లు, సినిమాలు, షికార్లు అంటూ కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు జాబ్ వల్ల సరైన నిద్రలేక అవస్థలు పడుతుంటారు. కారణమేదైనా రోజుకు కనీసం 7గం. నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సినంత నిద్ర, విశ్రాంతి లభించకపోతే బోలెడు వ్యాధులు చుట్టుముడతాయి. బీపీ, షుగర్, డిప్రెషన్, ఊబకాయంతో పాటు హార్ట్‌స్ట్రోక్, గుండె జబ్బులు కూడా వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ShareIt.

Similar News

News December 28, 2025

‘ముక్కోటి ఏకాదశి’ ఎందుకు స్పెషల్?

image

ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ముక్కోటి ఏకాదశి విశిష్టమైనది. ఈరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు చేసే ఉపవాసం మిగిలిన 23 ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే సామాన్య భక్తుల నుంచి మునుల వరకు అందరూ ఈ రోజును మోక్షాన్ని ప్రసాదించే గొప్ప పర్వదినంగా భావిస్తారు.

News December 28, 2025

తిరుమలలో స్థలం ఇవ్వాలని పవన్, అనగానిల అభ్యర్థన.. తిరస్కరించిన TTD

image

AP: తిరుమలలో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలన్న డిప్యూటీ సీఎం పవన్, మంత్రి అనగాని సత్యప్రసాద్‌ల అభ్యర్థనను టీటీడీ తిరస్కరించింది. ఈ నెల 16న పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా బయటకు వచ్చింది. కొండపై పరిమితంగా భూములు ఉండటం, కొత్త నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న భవనాలు కేటాయిస్తామని సదరు మంత్రులకు సమాచారం ఇచ్చింది.

News December 28, 2025

TET: 500 కి.మీ. దూరంలో సెంటర్లు

image

TG: టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొందరు అభ్యర్థులకు ఖమ్మంలో సెంటర్లు కేటాయించారు. దాదాపు 500KMకు పైగా దూరం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని పరీక్ష రాసే ఇన్ సర్వీస్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆలస్యంగా అప్లై చేసుకున్న వారికే దూరంగా సెంటర్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.