News September 23, 2025
సరిపడా సత్రాలు లేక మేడారం జాతరలో ఇబ్బందే..!

కోటి మంది భక్తుల కొంగుబంగారం మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను CM రేవంత్ రెడ్డి నేరుగా మంగళవారం పరిశీలించనున్నారు. కాగా, సారలమ్మ వచ్చే ఒకరోజు ముందుగానే భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి చేరుకుంటారు. అయితే, అక్కడ సరైన సత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరిపడా సత్రాలు ఏర్పాటు చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
Similar News
News September 23, 2025
దిలావర్పూర్: ఇక్కడ కోనేరులో బతుకమ్మల నిమజ్జనం

దిలావర్పూర్‌లో బతుకమ్మను నిమజ్జనం చేసే స్థలానికి ఓ ప్రత్యేకత దాగి ఉంది. పలుచోట్ల బతుకమ్మ నిమజ్జనాలు చెరువుల్లో, నదుల్లో వేస్తారు. కానీ ఇక్కడ చివరి రోజు అంగరంగ వైభవంగా కోలాలతో నృత్యాలు చేస్తూ రేణుక ఎల్లమ్మ కోనేరులో నిమజ్జనం చేస్తారు. ఈ కోనేరుకు చర్మ వ్యాధులను దూరం చేసే మహత్యం ఉందని విశిష్ట నమ్మకం. కోనేరులో బతుకమ్మలు వేయడం వల్ల మరింత శుద్ధి అవుతుందని నమ్మకం.
News September 23, 2025
హన్మకొండ: పచ్చదనం విరిసి.. అవని మురిసి..!

అందమైన ప్రకృతి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. చుట్టూ పంట పొలాలు, వాటి మధ్యలో గుట్టలు, ఎత్తైన తాటి చెట్లు, పంట పొలాల్లో పని చేస్తున్న రైతన్నలు, గొర్రెలను మేపుతున్న కాపరులు. ఇవన్నీ ఒకే చోట ఉంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పవచ్చు. అలాంటి దృశ్యం మన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామ శివారులోని ఇనుపరాతి గుట్టల వద్ద కనివిందు చేస్తోంది. అచ్చం ఓ చిత్రకారుడు గీసిన చిత్రలాగే ఉంది.
News September 23, 2025
టేక్మాల్: అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

అక్రమంగా యూరియాను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనంలో ఉన్న 250 యూరియా సంచులను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.