News August 22, 2025

సరిహద్దులను గుర్తించడానికి స్వమిత్వ సర్వే: జేసీ

image

గ్రామాలలో నివసించే ప్రజలకు ఉన్న భూమి హక్కులను నిర్ధారించడానికి గ్రామ సరిహద్దులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియే స్వమిత్వ సర్వే అని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఆమె అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఈ సర్వే నిర్వహణపై జిల్లాలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో సమీక్షించారు. సర్వే నిర్వహణ దశలను వారికి వివరించారు.

Similar News

News August 22, 2025

త్వరలో అసెంబ్లీ సమావేశాలు!

image

TG: త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జరిగే క్యాబినెట్ భేటీలో తేదీలు ఖరారు చేస్తారని విశ్వసనీయ సమాచారం. సమావేశాల సందర్భంగా కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గురించి ముఖ్యంగా చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

News August 22, 2025

జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

NTR జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను ఆయన సందర్శించారు. జిల్లాలో ఉన్న అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రాజధాని అమరావతికి గేట్‌వేగా ఉన్న NTR జిల్లాలో పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు.

News August 22, 2025

విజయవాడలో ప్రశాంతంగా యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు

image

విజయవాడలోని లబ్బీపేట రెడ్ సర్కిల్‌లో ఉన్న బిషప్ అజరయ్య బాలికల కళాశాల పరీక్షా కేంద్రంలో యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి రోజు పరీక్షకు మొత్తం 106 మంది అభ్యర్థులకు గాను, 102 మంది హాజరైనట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.