News April 21, 2024
సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ

గుమ్మఘట్ట మండలం కొత్తపల్లికుంట దొడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. కర్నాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెక్ పోస్టు గుండా వెళ్లొచ్చే రహదారికి ప్రత్యామ్నాయంగా ఉన్న దారులపై ప్రత్యేక నిఘా వేసి అక్రమాలకు కళ్లెం వేయాలన్నారు.
Similar News
News November 4, 2025
పోలీస్ పీజీఆర్ఎస్కు 105 పిటిషన్లు: ఎస్పీ

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.