News July 26, 2024

సరుబుజ్జిలి: అగ్రికల్చర్ అసిస్టెంట్ సస్పెండ్

image

సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కే.దుర్గారావు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఏవో బొడ్డేపల్లి పద్మనాభం గురువారం తెలిపారు. మద్యం సేవించి విధులకు హాజరు కావడం విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Similar News

News October 8, 2024

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ఖాళీలు.. 15 వరకు అప్లై చేసుకోండి

image

శ్రీకాకుళం జిల్లాలోని KGBVలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO తిరుమల చైతన్య తెలిపారు. కుకింగ్- 9, డేనైట్ వాచ్‌మెన్- 4, స్కావెంజర్- 3, స్వీపర్- 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో చౌకీదారు- 6, హెడ్‌కుక్- 4, సహాయ కుక్- 6 పోస్టులకు ఆసక్తి గల మహిళలు ఈ నెల 15లోగా MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: మద్యం దుకాణాలకు 880 దరఖాస్తులు

image

శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా ఏర్పాటుకానున్న ప్రైవేట్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులే గడువు ఉంది. ఈ నెల 2న ప్రారంభమైన ప్రక్రియ 9వ తేదీతో ముగియనుంది. అక్టోబర్ 7 నాటికి జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు 880 దరఖాస్తులు వచ్చాయి. శ్రీకాకుళంలో 32 దుకాణాలకు 266, టెక్కలిలో 11కు 19, కోటబొమ్మాళిలో 15 షాపులకు 31, రణస్థలంలో 15కు 176 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

News October 8, 2024

దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి

image

మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారులు, ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.