News April 3, 2025
సరుబుజ్జిలి: నాలుగు నెలల్లో 4 ఉద్యోగాలు

సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన వాకముల్లు రమణమూర్తి కుమారుడు బాలమురళి B.TECH పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. 2025 సంవత్సరంలో విడుదలైన రూరల్ బ్యాంక్(RRB) PO, క్లర్క్ ఫలితాల్లో ఉత్తీర్ణుడై చైతన్య గోదావరి బ్యాంక్‌లో పీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన IBPS క్లర్క్, RPF ఎస్ఐగానూ కూడా ఎంపికయ్యారు. 4 ఉద్యోగాలు సంపాదించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 8, 2025
శ్రీకాకుళం: ‘ఆధార్ సేవలను వినియోగించుకోండి’

జిల్లా ప్రజలందరికీ ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలోని 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 5 సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
News April 8, 2025
SKLM: ‘అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు’

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను చట్ట పరిధిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులకు ఎండార్స్ చేసి పరిష్కరించాలని చెప్పారు.
News April 7, 2025
లావేరు: ‘బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలి’

లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మీసాల భానోజీ రావు సోమవారం జరిగిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో బెట్టింగ్ యాప్‌లపై ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల మాఫియాపై నిఘా ఉంచాలని, వాటిని అరికట్టకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.